Thursday, 8 November 2018

ఘోరం.. మూడేళ్ల పాప నోట్లో బాంబ్ పెట్టి పేల్చాడు

Gnews telugu channelమూడేళ్ల పసిపాప నోట్లో దీపావళి బాంబు పెట్టి పేల్చాడు ఓ చెత్త వెధవ. చిన్నారికి తీవ్రమైన నోటి గాయాలయ్యాయి. యాభై కుట్లు పడ్డాయి. ఆమె పరిస్థితి క్రిటికల్ గా ఉందని డాక్టర్లు చెప్పారు. చిన్నారి గొంతుకు ఇన్ఫెక్షన్ సోకిందని డాక్టర్లు చెప్పారు. ఈ పరిస్థితి వల్లే ఆమె ఆరోగ్యం విషమిస్తోందని అన్నారు.
ఈ ఘోరమైన ఘటన ఉత్తర్ ప్రదేశ్ మీరట్ లోని మిలాక్ గ్రామంలో జరిగింది. వాడి పేరు హర్పాల్. యువకుడే. ఆడుకుంటున్న మూడేళ్ల పసిపాప నోట్లో బాంబు పెట్టి పేల్చాడు. దీపావళి పండుగ ముందురోజు సాయంత్రం జరిగిందీ ఘటన. తీవ్రగాయాలైన పాపను హాస్పిటల్ లో చేర్చారు. బాంబు పెట్టినోడు పరారీలో ఉన్నాడు.  పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి… నిందితుడి కోసం గాలిస్తున్నారు.

No comments:

Post a Comment