Gnews telugu channel: కడప జిల్లా గువ్వల చెరువు ఘాట్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. రాయచోటి నుంచి కడపకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గువ్వల చెరువు ఘాట్ రోడ్డు మీదుగా ప్రయాణిస్తోంది. అదే సమయంలో తమిళనాడుకు చెందిన ఓ లారీ ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొంది. దీంతో బస్సు పక్కకు పల్టీలు కొట్టింది. ఢీకొట్టిన లారీ సైతం పక్కకు పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108లో కడప రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో బస్సుకు, రహదారి పక్కనున్న గోడకు మధ్య ఓ కారు ఇరుక్కుపోయింది. అయితే కారులోని వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లారీ డ్రైవర్ అజాగ్రత వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Thursday, 1 November 2018
ఇదో విచిత్ర ప్రమాదం.. ముందు లారీ, పక్కన బస్సు, మధ్యలో కారు..
Gnews telugu channel: కడప జిల్లా గువ్వల చెరువు ఘాట్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. రాయచోటి నుంచి కడపకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గువ్వల చెరువు ఘాట్ రోడ్డు మీదుగా ప్రయాణిస్తోంది. అదే సమయంలో తమిళనాడుకు చెందిన ఓ లారీ ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొంది. దీంతో బస్సు పక్కకు పల్టీలు కొట్టింది. ఢీకొట్టిన లారీ సైతం పక్కకు పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108లో కడప రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో బస్సుకు, రహదారి పక్కనున్న గోడకు మధ్య ఓ కారు ఇరుక్కుపోయింది. అయితే కారులోని వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లారీ డ్రైవర్ అజాగ్రత వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment