Gnews telugu channel:టెక్నాలజీలో ప్రపంచం రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. రోజుకో కొత్త ఆవిష్కరణతో ప్రపంచం రూపురేఖలు మారిపోతున్నాయి. ఇక టెక్నాలజీ లో ప్రపంచంతో పోటీపడే చైనా.. ఇప్పుడు మరో సంచలనంతో దూసుకొచ్చింది. వరల్డ్ లో ఫస్ట్ టైం చైనా అధికారిక న్యూస్ ఛానల్ జిన్హువా… ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ యాంకర్‌తో వార్తలు చదివించింది. 24 గంటలు.. 365 రోజులూ ఈ యాంకర్ ఏ మాత్రం ఆలసిపోకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వార్తలను అందిస్తాడని ఆ ఛానల్ తెలిపింది. న్యూస్ యాంకర్‌ని జిన్హువా న్యూస్ ఏజెన్సీ, చైనా సెర్చ్ ఇంజిన్ సొగోవ్.కామ్ కంబైన్డ్ గా డిజైన్ చేశాయి. మెషీన్ లెర్నింగ్ ద్వారా దీనిని డెవలప్ చేశారు. ఏయే సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలి, ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ ను ఎలా మార్చాలి అన్నవిషయాల్లో దీనికి ట్రైనింగ్ ఇచ్చారు. జిన్హువా న్యూస్‌లో రెగ్యులర్‌గా కనిపించే కియు హావో అనే యాంకర్ డిజిటలైజ్డ్ వర్షన్‌ను రూపొందించి ఆ ఛానెల్ ఈ న్యూస్ చదివించింది. చైనా ఇంట్రడ్యూస్ చేసిన ఈ వర్చువల్ యాంకర్ తో.. ఫ్యూచర్ లో న్యూస్ ఇలానే ఉంటుందా అన్న ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి.
No comments:
Post a Comment