Gnews telugu channel:శబరిమల : అన్ని వయసుల మహిళలు శబరిమల ఆలయంలో ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత రెండోసారి సోమవారం సాయంత్రం గుడి తలుపులు తెరుచుకున్నాయి. ఆడవారి ప్రవేశాన్ని అయ్యప్ప భక్తుల సమాజం, హిందూత్వ సంఘాలు వ్యతిరేకిస్తుండటంతో… అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మహిళా భక్తుల ప్రవేశాన్ని అడ్డుకుంటామని.. గుడి పవిత్రతను కాపాడుకుంటామని ఆందోళనకారులు, అయ్యప్ప భక్తులు అంటున్నారు.
మరోవైపు.. సుప్రీంఆదేశాలు.. రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో.. గుడి ప్రాంగణంలో వేలాదిమంది పోలీసులు మోహరించారు. మహిళా భక్తులు వస్తే దర్శనానికి ఇబ్బంది రాకుండా చూసేందుకు ఉన్నతాధికారులు భద్రతను పరిశీలిస్తున్నారు. ఇటీవల శబరిమలలో అయ్యప్ప దర్శనానికి కొందరు మహిళలు రావడంతో.. ప్రధాన పూజారి గుడి తలుపులు తీసేది లేదని.. వెనక్కి వెళ్లిపోవాలని హెచ్చరించారు.
ఉద్రిక్తతలు తగ్గించే ఉద్దేశంతో… గుడి పరిసరాల్లో మొబైల్ జామర్లు పెట్టారు పోలీసులు. ప్రధాన పూజారి, ఇతర గుడి అధికారుల మధ్య కమ్యూనికేట్ కట్ చేశారు. లైవ్ విజువల్స్ రికార్డ్ కాకుండా చూస్తున్నారు. భక్తుల హక్కులను భంగం కలిగిస్తున్నారన్న ఉద్దేశంతో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పోలీస్ చర్యలను భక్తజనసంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది. గుడి తలుపులు మళ్లీ మంగళవారం రాత్రి పదిగంటలకు మూసివేయనున్నారు. 2వేల 3వందల మంది పోలీసులు… 20 మందితో కూడిన కమాండో టీమ్.. యాభయ్యేళ్లకు పైబడిన వయసున్న 15మంది మహిళా పోలీసులు గుడి దగ్గర గస్తీ కాస్తున్నారు.

No comments:
Post a Comment