Tuesday, 6 November 2018

పోలీస్ స్టేషన్ లో పురుగుల మందు తాగిన ప్రేమికులు

Gnews telugu channel: వికారాబాద్ : తాండూర్ పోలీస్ స్టేషన్ లో ప్రేమికులు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. వీరిని వెంటనే వైద్య చికిత్స కోసం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ట్రీట్ మెంట్ అందించిన డాక్టర్లు.. ప్రాణాపాయం లేదని చెప్పారు.
పరిగి మండలం కంకల్ గ్రామానికి చెందిన నవీన్ (18), వినీత(18) ప్రేమించుకున్నారు. వినీత శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. అబ్బాయి ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో నవంబర్ 2వ తేదీన మహారాష్ట్రలోని ముంబైకి పారిపోయారు. తిరిగి ఇవాళ (నవంబర్ 5) రోజున ముంబై నుంచి తాండూర్ కు వస్తుండగా రైల్వే స్టేషన్లో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ ప్రేమను ఎవరూ అంగీకరించరన్న ఉద్దేశంతో.. పోలీస్ స్టేషన్లోనే ఇద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

No comments:

Post a Comment