హైదరాబాద్: Gnews telugu channel:
సామాజిక మాధ్యమాల్లో తనపై చేస్తున్న అభ్యంతర వ్యాఖ్యలను వైకాపా నేత షర్మిల తీవ్రంగా ఖండించారు.
అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైకాపా సీనియర్ నేతలతో కలిసి సోమవారం హైదరాబాద్ సీపీ కార్యాలయానికి వెళ్లిన షర్మిల ఈ విషయంపై ఫిర్యాదు చేశారు.
తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టడం బాధాకరమని, వీటి వెనుక తెదేపా హస్తం ఉందని ఆమె ఆరోపించారు.
‘నాకూ, ప్రభాస్‌కు సంబంధం ఉందని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు.
నా జీవితంలో ప్రభాస్‌ను ఎప్పుడూ కలవలేదు, ఆయనతో మాట్లాడలేదు.
2014 ఎన్నికల ముందు కూడా ఇలాంటి ప్రచారాలే చేశారు.
అప్పుడు పోలీసులు చర్యలు తీసుకోవడంతో కొంతకాలం ఆగింది.
ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ ఈ దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు.
దీని వెనుక తెదేపా హస్తం ఉంది’ అని షర్మిల ఆరోపించారు.
ఇది తన ఒక్క దానికే జరిగిన అవమానంగా భావించట్లేదని, స్త్రీల పట్ల చులకనభావంతో రాస్తున్న రాతలను, దుష్ప్రచారాన్ని మన సమాజం ఆమోదించవచ్చా? అని షర్మిల ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యం, మానవహక్కులు, సమానత్వం లాంటి గొప్ప గొప్ప పదాలు కాగితాలకు, చర్చలకు మాత్రమే పరిమితం కాకూడదన్నారు.
ఇవి వాస్తవరూపం దాల్చాలంటే మనం గొంతెత్తాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.
సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి ప్రచారాలకు వీలు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్న తన ఫిర్యాదుకు ప్రజాస్వామ్యవాదులు, జర్నలిస్టులు, మహిళలు మద్దతు పలకాలని కోరారు.

No comments:
Post a Comment