Gnews telugu channel: బోనులోంచి తప్పించుకు వెళ్లిన ఓ శునకం ఏకంగా 600 కోళ్లను చంపిన ఘటన చైనాలో జరిగింది. అన్హుయి ఫ్రావిన్స్ కు చెందిన నిన్గువోలో.. ఒక వ్యక్తి కొంత కాలంగా హస్కీ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నాడు. ఇటీవల ఓ రోజు రాత్రి అది తన బోనులోంచి తప్పించుకుని వెళ్లింది. అలా వెళ్తుండగా, దానికి కోళ్ల ఫారమ్ కనిపించింది. అంతే ఎలాగోలా అందులోకి వెళ్లి, లోపల ఉన్న దాదాపు 600 కోళ్లను కొరికి చంపేసింది. అన్ని కోళ్లను ఒక్క రాత్రిలోనే చంపేసింది. ఉదయం కోళ్ల ఫారమ్ యజమాని వచ్చేసరికి అన్ని కోళ్లు చనిపోయి ఉన్నాయి. దీంతో షాక్ కు గురైన కోళ్ల ఫారం యజమాని చుట్టు పక్కల వెతకగా, నోటిలో కోడిని కరుచుకుని ఉన్న కుక్క కనిపించింది. దాన్ని కట్టేసి , వెంటనే యజమాని ఇంటికి వెళ్లి, అతడ్ని నష్టపరిహారం చెల్లించమని కోరాడు. ఇందుకు ముందుగా యజమాని అంగీకరించలేదు. చివరకు పోలీసులు ఎంటర్ అవ్వడంతో నష్టపరిహారంగా మన కరెన్సీలో దాదాపు లక్షన్నర రూపాయలు చెల్లించేందుకు అంగీకరించాడు. అయితే ఒక్క పూటలోనే కుక్క ఇన్ని కోళ్లను ఎలా చంపిందా అని స్థానికులు ఆశ్చర్యపోయారు. అయితే హస్కీ రకం కుక్కలు వేటాడడంలో నైపుణ్యం కలిగి , ఆవేశంతో ఉంటాయని.. అందువల్లే ఇన్ని కోళ్లను చంపగలిగిందని నిపుణులు చెపుతున్నారు.
Thursday, 8 November 2018
ఈ కుక్కకు ఆవేశం ఎక్కువ.. 600 కోళ్లను చంపేసింది

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment