Gnews telugu channel:యూత్ లో సెల్ఫీల పిచ్చి రోజురోజుకీ పెరిగిపోతుంది. పొద్దున లేచింది మొదలు.. పడుకునే వరకు సందర్భాన్ని బట్టి తమ ఫోన్లలో సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. ఈ సమయంలో వారు చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించకపోవడంతో ఆ సెల్ఫీలు వారి ప్రాణాలను తీస్తున్నాయి.ఇక యూత్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ సెల్ఫీల కోసం ట్రై చేస్తూ వారు తమ ప్రాణాలను కోల్పోతున్న ఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంది. ఇలాంటి ఘటనే ఒకటి ఏపిలోని నెల్లూరు జిల్లాలో జరిగింది. జిల్లాలోని సూళ్లూరుపేట కు చెందిన ఓ యువకుడు పాములాడించే వ్యక్తి దగ్గర ఉన్న పాముతో సెల్ఫీ కోసం ట్రై చేశాడు. ఈ క్రమంలో ఆ పాము కాటు వేయడంతో ఆ యువకుడు చనిపోయాడు.
No comments:
Post a Comment