Thursday, 15 November 2018

ఓ నగరం బూడిదైంది.. కార్చిచ్చులో 140మంది గల్లంతు.. 60మంది మృతి

 Gnews telugu channel: కాలిఫోర్నియా లో ఐదు రోజుల క్రితం అడవిలో అంటుకున్న మంటలు ఆగలేదు.. దాదాపు ఒక నగరాన్ని సమూలంగా నాశనం చేశాయి. ఇప్పటి వరకు 60 మంది మృతి చెందగా.. 140 మంది కనిపించకుండా పోయారు. వీరిలో ఎక్కువ మంది 70, 80, 90 సంవత్సరాల వయస్సు ఉన్నవారే. సియెర్రా నేవెడా పర్వతాల సమీపంలో ఉన్న పారడైజ్‌ నగరంలో 26వేల మంది జనాభా ఉండేవారు. గత వారం చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించి పారడైజ్‌ నగరాన్ని కాల్చేశాయి. గాలులు విపరీతంగా వీయడంతో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపుచేయలేకపోయారు.
ఈ కార్చిచ్చులో నగరం సమూలంగా నాశనం అయింది. ప్రస్తుతం సహాయక సిబ్బంది కాలిపోయిన ఇండ్ల నుండి మృత దేహాలను బయటకు తీస్తున్నారు. ప్రస్తుతం అధికారికంగా 59 మంది మృతి చెందినట్లు తెలిసింది. కానీ మరింత మంది అగ్నికి ఆహుతి అయినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికీ కార్చిచ్చు రగులుతూనే ఉంది.

No comments:

Post a Comment