Tuesday, 13 November 2018

గాలి వ్యాపారం షురూ.. లీటరుకు 500 రూపాయలు

Gnews telugu channel: ఢిల్లీ : మానవులు చేస్తున్న తప్పిదం ప్రకృతికి శాపంగా మారుతుంది. అది తిరిగి తిరిగి.. మనిషి జీవనాన్ని కబలించేందుకు సిద్ధమవుతుంది. పకృతి సృష్టించిన పంచభూతాలలో గాలిని, భూమిని, ఆకాశాన్ని, నీటిని మానవులు తమ స్వార్ధం కోసం నాశనం చేస్తున్నారు. అందుకుగాను ఊహించని ప్రకృతి విపత్తులు జరుగుతున్నాయి. ప్రకృతి ఇచ్చిన సహజ సంపదలో వేగంగా కాలుష్యానికి గురవుతున్నది వాయువు. ఇది చాలా మందికి ప్రాణాంతకంగా మారుతుంది. ఈ పరిస్తితిని కొందరు వ్యాపారానికి అనుగునంగా మార్చుకుంటున్నారు.
ప్రస్తుతం భారత దేశ రాజధాని ఢిల్లీ లో విపరీతమైన వాయు కాలుష్యం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నగరంలో ప్రస్తుతం స్వచ్చమైన గాలిని అమ్ముతున్నారు కొందరు వ్యాపారులు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ సంస్థ 7.5 లీటర్ల గాలిని 1499 రూపాయలకు అమ్ముతుంది. లీటర్ గాలి కావాలన్నా బాటిల్ రూపంలో ఇస్తామని ఆఫర్లు కూడా ఇస్తున్నారు… దీంతో పాటే ఉత్తరాఖండ్ కు చెందిన ఓ కంపెనీ  160 సార్లు పీల్చుకునే గాలికి 500 రూపాయలకు అమ్ముతుంది. ఈ గాలిని కొనుగోలు చేస్తే, బాటిల్ తో పాటు, ఓ మాస్క్ మాదిరిగా ఉండే పంపు కూడా లభిస్తుంది. దీన్ని ముఖానికి అమర్చుకుని బటన్ పుష్ చేస్తే, స్ప్రే మాదిరిగా తాజా గాలి, ముక్కుకు అందుతుంది. వినడానికి వింతగా ఉన్నా రానున్న రోజులు ఇలాగే ఉంటే, మనిషి మనుగడకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి వస్తుంది.

No comments:

Post a Comment