Thursday, 22 November 2018

వినూత్న ప్రచారం: మాట తప్పితే ఈ చెప్పుతోనే కొట్టండి

Gnews telugu channel: ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీల నేతలు ప్రచారంలో బిజీ అయ్యారు. హామీలతో ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి ఇండిపెండెంట్‌‌గా పోటీ చేస్తున్న ఆకుల హనుమంతు వినూత్న ప్రచారం చేపట్టారు. ఓటర్లకు కరపత్రాలతో పాటు చెప్పులు కూడా పంపిణీ చేస్తున్నారు.చెప్పుల పంపిణీ ఏందని ఆశ్చర్యపోకండి.ఎన్నికల్లో తాను గెలిచాక మాట తప్పితే.. అభివృద్ధి చేయకపోతే ఈ చెప్పుల తోనే తనను నడిరోడ్డు మీద కొట్టాలని ఆయన కోరుతున్నారు. అంతేకాదు తాను పని చేయకుంటే రాజీనామా పత్రాన్ని ఎవరైనా సరే అసెంబ్లీకి పంపి తన MLA సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చన్నారు. ప్రశ్నించే హక్కు ప్రతి ఓటరుకు ఉందని, ఎన్నికైన నాయకుడు పనిచేయకపోతే దండించాల్సింది కూడా ఓటరేనన్నారు హనుమంతు. ఆయన ప్రచార వీడియో ఇప్పుడు సోషల్‌‌మీడియాలో వైరల్‌‌గా మారింది. దీన్ని చూసి ఇతర అభ్యర్థులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.

No comments:

Post a Comment