Friday, 2 November 2018

ప్రచారంలో డబ్బు,మద్యం పంపిణీ చేస్తే కేసులు నమోదు

Gnews telugu channel: హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో డబ్బు,మద్యం పంపిణీ చేస్తే కేసులు నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులు,ఎస్పీలను రాష్ర్ట ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ఆదేశించారు. సోషల్ మీడియాను ఆధారంగా చేసుకొని కూడా కేసు నమోదు చేయొచ్చని తెలిపారు. స్టేషన్ ఘన్ పూర్ లో టీఆర్ఎస్ కార్యకర్త ఒకరు మహిళలకు డబ్బులు పంపిణీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీఈవో దానిని సుమోటోగా స్వీకరించారు.  ఇక అధికారిక విధుల్లో భాగంగానే ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు తెలంగాణలో పనిచేస్తున్నారని తెలంగాణ,ఏపీ డీజీపీలు సీఈవోకు వివరణ ఇచ్చారు.

No comments:

Post a Comment