Gnews telugu channel: హైదరాబాద్: రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు ఓల్డ్ సిటీ మీర్ చౌక్ ఎస్ఐ, కానిస్టేబుల్. ఓ పెండింగ్ కేసులో రాజీ కుదర్చడానికి అనిల్ కుమార్ అనే బాధితుడి దగ్గర రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్ గా ఏసీబీకి చిక్కారు ఎస్ఐ సారంగపాని , కానిస్టేబుల్ కిరణ్. 2017 సంవత్సరంకు సంబంధించిన చీటింగ్ కేసులో అనిల్ కుమార్ కి జితేందర్ కు రాజీ కుదిరించడానికి 2 లక్షలు డిమాండ్ చేశాడు ఎస్ఐ. ఇందులో భాగంగా మంగళవారం (అక్టోబర్-23) అనిల్ కుమార్ దగ్గర నుండి ఎస్ఐ అడ్వాన్సుగా రూ.50 వేలు లంచం తీసుకుంటుడగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఈ క్రమంలోనే కేసు నమోదుచేసిన ఏసీబీ అధికారులు.. డబ్బులను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
No comments:
Post a Comment