Wednesday, 24 October 2018

వెదర్ అలర్ట్: వచ్చే 5 రోజుల్లో ఎండలు దంచికొడతాయి

హైదరాబాద్ : రాష్ట్రంలో వచ్చే 5 రోజుల్లో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని వెదర్ డిపార్ట్ మెంట్ తెలిపింది. దసరా తర్వాత సాధారణ ఉష్ణోగ్రత కంటే నాలుగు డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైందని.. ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రత 34.2 డిగ్రీల సెల్సియస్ ఉండగా, కనిష్ట ఉష్ణోగ్రత 20.3 డిగ్రీల సెల్సియస్‌గా ఉందని అధికారులు తెలిపారు. అక్టోబర్ 18 నాటికి 97 శాతం తేమ ఉండగా.. హైదరాబాద్‌లో సోమవారం(అక్టోబర్.21) తేమ శాతం  42 శాతానికి తగ్గిపోయింది. అక్టోబర్ చివరి నాటికి 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు .

No comments:

Post a Comment