Gnews telugu channel:sircilla news updates
• గొప్ప పుణ్యక్షేత్రంగా వేములవాడ
• 500 కోట్లతో అభివృద్ధి పనులు
• గోదావరి జలాలతో జిల్లా సస్యశ్యామలం
• నియోజకవర్గంలో పేదలకు 800 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం
• 30 రోజుల కార్యాచరణ అమలు కార్యక్రమం ను విజయవంతం చేయండి
• రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
సిరిసిల్ల,05 సెప్టెంబర్ 2019:
కాళేశ్వరం ప్రాజెక్ట్ తో రాష్ట్రంలోని 14 జిల్లాలు సస్య శ్యామలం కానున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు . సాగునీటి సమస్యల తో పాటు త్రాగునీటి సమస్యలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ శాశ్వత పరిష్కారం చూపనుందని తెలిపారు . ఉమ్మడి రాష్ట్రం , స్వరాష్ట్రం లో పరిస్టితులు బేరీజు వేసుకుంటే క్షేత్రస్థాయిలో జరిగిన అభివృద్ధి మన కళ్ళముందే కనిపిస్తుందన్నారు . రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి జరగనుందని మంత్రి తెలిపారు .
గురువారం వేములవాడ సంకెపెల్లి శివారులో లో రూ .17 కోట్ల 10 లక్షలతో చేపట్టిన శ్రీ రాజేశ్వర ( మధ్య మానేరు ) జలాశయం ఫోర్ షేర్ నుండి గుడి చెరువు కు గోదావరి జలాలను తీసుకువచ్చే ఎత్తిపోతల పథకం కు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, స్థానిక శాసన సభ్యులు శ్రీ చెన్నమనేని రమేష్ బాబు , జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ తో కలిసి ప్రారంభోత్సవం చేసారు .
అనంతరం వేములవాడ గుడి చెరువు వద్ద గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు .
ఈ సందర్భంగా గుడి చెరువు వద్ద స్థానిక శాసన సభ్యులు శ్రీ చెన్నమనేని రమేష్ బాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు .
గుడిచెరువు ఎత్తిపోతల పథకంతో వేములవాడ పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మ గుడం 365 రోజులు గోదావరి జలాలతో నిండు గా ఉంటుందన్నారు .
సామాన్యుల కొంగు బంగారంగా .... రాష్ట్రంలోనే అధిక భక్తులు వచ్చే దేవాలయం గా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారికీ ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు . మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రాజన్న దర్శనం కు వస్తారన్నారు .అలాంటి సుప్రసిద్ధ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయం ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు .
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో వేములవాడ పుణ్యక్షేత్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు . గుడి చెరువు కోసం 30 ఎకరాల స్థలం ను రైతుల నుంచి సేకరించి గుడి చెరువు ను నిర్మించుకున్నామని అన్నారు. దేవతల అనుగ్రహంతో గుడి చెరువు లోకి గోదావరి జలాలను ఎత్తిపోసుకునే కార్యక్రమం విజయవంతం అయ్యిందన్నారు . నాలుగు వందల కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధి పనులు సాగుతున్నాయని మంత్రి అన్నారు. స్థానిక శాసన సభ్యులు వేములవాడ ఆలయం తో పాటు నియోజవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారని మంత్రి ప్రసంశించారు . రానున్న రోజుల్లో భక్తులకు సకల సౌకర్యాలతో వేములవాడ పట్టణం గొప్ప పుణ్యక్షేత్రంగా శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయం విలసిల్లుతుందని అన్నారు. మేడిగడ్డ ,అన్నారం ,సుందిళ్ళ బ్యారేజి లతో తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని అన్నారు . ప్రస్తుతం గోదావరి నుంచి ప్రతి రోజు 2 TMC ల నీరు ఎత్తిపోతల ద్వారా తీసుకుంటున్నామని ..రానున్న రోజుల్లో అదనంగా మరో TMC నీటిని తీసుకునేందుకు ముఖ్యమంత్రి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని అన్నారు . అంతేకాకుండా రైతుబందు ,కళ్యాణ లక్షి , షాదీ ముబారక్ , ఆసరా పెన్షన్ లు ,KCR కిట్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు .
స్థానిక శాసన సభ్యులు శ్రీ చెన్నమనేని రమేష్ బాబు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వేములవాడ నియోజకవర్గంలో ఒక లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తామన్నారు . మిడ్ మానేరు నుంచి 17.50 కోట్ల వ్యయంతో నిర్మిం చిన ఎత్తిపోతల పథకం ద్వారా ఇకపై గుడి చెరువులో 365 రోజుల నీళ్లు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.. పట్టణ త్రాగునీటి అవసరాలు తీరుతాయన్నారు . 400 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు చేపదుతున్నామని దశల వారిగా పనులను క్రమపద్దతిలో పూర్తీ చేస్తామన్నారు . 272 కోట్లతో వేములవాడ చుట్టూరా పరిసరాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు . భక్తుల సౌకర్యార్థం 31 ప్లాట్ ఫాం లతో 20 కోట్ల అంచనా వ్యయంతో నూతన బస్సు స్టాండ్ ను నిర్మిస్తామన్నారు . నియోజకవర్గంలో 800 డబుల్ బెడ్‌రూం ఇళ్లనిర్మాణం మహిళల పేరుతొ కట్టనున్నామని శాసన సభ్యలు తెలిపారు . త్వరలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తామని తెలిపారు . ఒక్క పైసా ఖర్చు లేకుండా నియోజకవర్గ పేద ప్రజలకు సూపర్ స్పెషాలి టి వైద్య సేవలు అందుతాయన్నారు. రానున్న రోజుల్లో నియోజవర్గం ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని శ్రీ చెన్నమనేని రమేష్ బాబు
కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ , జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణభాస్కర్, ఆర్డీవో శ్రీ శ్రీనివాసరావు, ఇ రి గేషన్ ఈ ఈ శ్రీ అమరేందర్ , MMR ఈఈ శ్రీ అశోక్ , తహసిల్దార్ శ్రీనివాస్ స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు .

No comments:
Post a Comment