Gnews telugu channel: హైదరాబాద్ : ఆధునిక సౌకర్యాలతో, హంగులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఎమెల్యేల క్వార్టర్స్ ప్రారంభానికి ముస్తాబయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. సుమారు మూడు సంవత్సరాలపాటు అత్యంత సాంకేతిక నైపుణ్యతతో నిర్మించిన ఎంఎల్‌ఏల నివాసిత గృహాల్లో వేగవంతమైన ఇంటర్నెట్, ప్రతి గదిలో టివి, పటిష్టమైన భద్రతా వ్యవస్థను చేశారు. హైదర్‌గూడలో పాత ఎంఎల్‌ఏ క్వార్టర్స్‌ను కూల్చివేసి అదే ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా క్వార్టర్స్‌ను నిర్మించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం నామినేటెడ్ సభ్యుడుతో కలిపి 120 మంది శాసన సభ్యులు మొత్తం ఒకే ప్రాంగణంలో ఉండే విధంగా భవనాన్ని నిర్మించింది. నాలుగు ఎకరాల 26 గుంటల స్థలంలో 12 అంతస్తుల్లో రూ. 166 కోట్లతో ఎంఎల్‌ఏ క్వార్టర్స్‌ను నిర్మించారు. . విశాలమైన కారిడార్లతో ప్రతి క్వార్టర్ 2500 చదరపుగజాల విస్తీర్ణంలో నిర్మించారు. కాగా, ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు.
Monday, 17 June 2019
ఎమ్మెల్యేలకు ఇక కొత్త నివాస ఇళ్ళు

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment