Saturday, 17 November 2018

షాకింగ్ న్యూస్ : రైల్వే స్టేషన్ లో వెయ్యి కిలోల కుక్క మాంసం స్వాధీనం

Gnews telugu channel: చెన్నై : చెన్నై హోటళ్లలో పిల్లిమాంసంకు విపరీతమైన డిమాండ్ ఉన్న సంగతి అప్పట్లోనే సంచలనం రేపింది. గతంలో ఓ బిర్యానీ హోటల్ లో పిల్లిమాంసంను పట్టుకున్న కేసులు ఉన్నాయి. ఇపుడు మరో భారీ షాకింగ్ న్యూస్ వెలుగుచూసింది. చెన్నైలోని హోటళ్లకు అత్యంత భారీ స్థాయిలో థర్మాకోల్ డబ్బాల్లో కుక్కల మాంసం తరలిస్తుండగా పోలీసులు , అధికారులు పట్టుకున్నారు.
ఎగ్మోర్ రైల్వే స్టేషన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు కుక్క మాంసం డబ్బాలను పట్టుకున్నారు. తోలు తీసిన కుక్కల శరీరాలను… థర్మాకోల్ డబ్బాల్లో ఐస్ మధ్య పెట్టి…. చెన్నై నగరానికి సరఫరా చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎగ్మోర్ రైల్వే స్టేషన్ లో ఆ డబ్బాలను బయటకు తీయించారు. ఒక్కో డబ్బాలో కుక్కల కలేబరాలు బయటపడుతుండటం చూసి అధికారులే షాక్ అయ్యారు. మొత్తం వెయ్యి కేజీల కుక్క మాంసాన్ని తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారు. జోధ్ పూర్ నుంచి ఈ కుక్క మాంసాన్ని చెన్నై నగరానికి తరలిస్తున్నారని పోలీసులు చెప్పారు.
చెన్నైలో పలు రెస్టారెంట్లు, హోటళ్లలో కుక్కమాంసం అమ్ముతున్నారని ఎప్పటినుంచో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా.. కుక్కల మాంసం బయటపడటంతో… షాకింగ్ వాస్తవం బయటపడింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు తమిళనాడు పోలీసులు.

No comments:

Post a Comment