Gnews telugu channel: హైదరాబాద్ : చర్లపల్లి జైల్లో ఖైదీలతో తయారుచేయబడిన వస్తు ఉత్పత్తులను అమ్మేందుకు ఉత్సాహవంతులైన వ్యాపారస్తులు, దుకాణదారులు ముందుకు రావాలని కోరారు జైలు అధికారులు. ఖైదీలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులు క్వాలిటీగా ఉంటున్నాయని చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ అధికారి ఎంఆర్ భాస్కర్ అన్నారు. జైళ్లలో… పెట్రోల్ పంప్, బేకరీ, ఫ్యాక్టరీ ఐటమ్స్ ను తయారు చేయిస్తున్నామన్నారు. బీరువా, జంపుఖానా, స్టీల్ ఇండస్ట్రీ వస్తువులు, సబ్బులు, పసుపు పౌడర్, మిర్చీ పౌడర్, గోధుమపిండి, శనగ పిండి, ఫినాయిల్ లాంటి వస్తువులను వంద శాతం క్వాలిటీతో తయారు చేయిస్తున్నామని చెప్పారు. జైల్లో ప్రత్యేకంగా తయారుచేయించిన వస్తువులు అమ్మే దుకాణాలకు ‘మై నేషన్ ఔట్ లెట్’ అనే పేరు పెట్టినట్టు చెప్పారు.
మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, మండల కేంద్రాల్లో ‘మై నేషన్ ఔట్ లెట్’ ఏర్పాటుకు నవంబర్ నెలాఖరువరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 94946 32106, 94405 43417 నంబర్లను సంప్రదించాలన్నారు. కుషాయి గూడ సాయినగర్ లో ఏర్పాటుచేసిన ఓ ఔట్ లెట్ ను జైలు అధికారులు ప్రారంభించారు. ఉపాధి కోసం త్వరలో 100 పెట్రోల్ బంక్ లు, 100 మై నేషన్ ఔట్ లెట్లు ఏర్పాటుచేయాలనుకుంటున్నట్టు చెప్పారు. విడుదలైన ఖైదీలు ఉపాధి పొందేలా పలు రంగాల్లో శిక్షణ ఇప్పిస్తున్టట్టు చెప్పారు.

No comments:
Post a Comment