Gnews telugu channel: ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు ఎంత కఠినం’ అనుకున్నాడేమో ఆ కుర్రాడు. ప్రేమించిన పిల్లపైనే కేసు పెట్టడానికి పోలీసు స్టేషన్ మెట్లెక్కాడు. ‘ఆ అమ్మాయి నా మనసు దోచేసింది.. ఆమెపై దొంగతనం కేసు పెట్టి.. దాన్ని రికవరీ చేసి పెట్టండి’ అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నాగ్ పూర్ లోని ఓ స్టేషన్లో గత వారం కేసు పెట్టడానికి వచ్చిన ఆ కుర్రాడిని చూసి పోలీసులంతా షాకయ్యారు. మనసును రికవరీ చేయడం ఏంటి అని తలలు పట్టుకున్నారు. CIకి ఏం చేయాలో అర్థం కాలేదు. పై అధికారులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వాళ్లు లా పుస్తకాలు తిరగేసి ఇలాంటి కేసులకు ఇండియన్ పీనల్ కోడ్లో ఆస్కారం లేదని తేల్చేశారు. దీంతో CI ఆ కుర్రాడిని స్టేషన్ నుంచి పంపేశాడు. ఈ కేసు వివరాలను నాగ్ పూర్ కమిషన్ భూషన్ కుమార్ ఉపాధ్యాయ వివరించారు. గత వారం రూ.82 లక్షల చోరీ సొత్తు రికవరీ తర్వాత పెట్టిన మీడియా సమావేశంలో ఈ వివరాలు తెలిపారు. కంటికి కనిపించే వస్తువులనైతే రికవరీ చేయగలం కానీ, మనసును ఎలా తెస్తాం అంటూ నవ్వులు పూయించారు
No comments:
Post a Comment