Thursday, 17 January 2019

మాకు రక్షణ కల్పించండి : సుప్రీంకోర్టులో కనకదుర్గ, బిందు పిటిషన్

Gnews telugu channel: జనవరి 2వ తేదీన శబరిమల గుడిలోకి వెళ్లారు కనకదుర్గ, బిందు. పోలీసు ప్రొటెక్షన్ మధ్య… శబరిమల గుడిలో అయ్యప్పను దర్శించుకున్నారు. మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత తొలిసారి ఆలయంలోకి ప్రవేశించింది ఈ ఇద్దరు మహిళలే. ఆ సంఘటన తర్వాత… కేరళలో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఆలయ ప్రవేశం చేసినందుకు తమకు హాని చేయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని, రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కనకదుర్గ, బిందు.

No comments:

Post a Comment