Tuesday, 6 November 2018

కొత్త ఫోన్లలో బ్యాటరీ ఆగట్లేదు.. ఇదే కారణం

Gnews telugu channel:ఒక్కసారి చార్జింగ్‌ పెట్టం డి.రెండు రోజులు ఫోన్‌ ను వాడేసుకోవచ్చు.. ఐదు నిమిషాలు చార్జ్‌ చేయండి. రెండు గంటలు మాట్లాడుకోవచ్చు.. ముందు కన్నా బ్యాటరీ మరింత పవర్‌‌ఫుల్‌ గా ఉంటుందంటూ ఏదైనా కొత్త ఫోన్‌ మార్కెట్‌ లోకి రిలీజ్‌ అయ్యే ముందు కంపెనీలు చెప్పే మాటలివి. మరి, నిజంగానే ఫోన్ల బ్యాటరీ అంత ఎక్కువ సేపు వస్తోందా? అంటే అంతా హుళక్కేనట. వాళ్ల మాటలు తప్ప ఫోన్ల చేతలు కనిపించట్లేదట. వాటి కంటే పాత ఫోన్లే నయమంటున్నారు యూజర్లు.
ఫోన్లు ఎంత స్మార్ట్‌‌ అవుతున్నాయో బ్యాటరీల్లో చార్జింగ్ అంత త్వరగా అయిపోతుందట. ఐఫోన్‌ 10ఎస్‌‌, గూగుల్‌ పిక్సెల్‌ 3 సహా 13 మోడళ్ల బ్యాటరీ లైఫ్‌ పై చేసిన రీసెర్చ్ ని ప్రముఖ అంతర్జా తీయ పత్రిక ప్రచురించింది. దానికి కారణమూ లేకపోలేదు. ఇప్పుడు వచ్చే స్మార్ట్ ఫోన్లన్నీ ఓఎల్‌ ఈడీలతో స్క్రీన్లతో వస్తున్నాయి, ఓఎల్‌ ఈడీలు ఆపరేట్‌ కావాలంటే ఎక్కువ ఎనర్జీ కావాలి.దాని వల్లే బ్యాటరీ త్వరగా డెడ్‌ అయిపోతోందట. ఉదాహరణకు ఐఫోన్‌ 10ఎస్‌‌ మ్యాక్స్‌‌నే తీసుకుంటే , ఐఫోన్‌ 10 కన్నా 21 నిమిషాల ముందే బ్యాటరీ ఖాళీ అవుతోందని ప్రయోగాత్మకంగా నిరూపించారు రీసెర్చర్లు . శాంసంగ్‌ నోట్‌ 9 మాత్రం దానికి ముందు విడుదలడ చేసిన ఎస్‌‌9 మోడల్‌ కన్నా 4 గంటలు ఎక్కువ బ్యాటరీ లైఫ్‌ ఇస్తోంది.

No comments:

Post a Comment