Wednesday, 7 November 2018

దుబాయ్ లో తొలి దీపావళి.. హోరెత్తుతున్న సంబురాలు

  Gnews telugu channel: దుబాయ్ లో తొలిసారి దీపావళి పండుగను అధికారికంగా జరుపుతున్నారు. ఉత్సవాలను ఏకంగా 10 రోజులు  నిర్వహిస్తున్నట్టు దుబాయ్ అధికారులు తెలిపారు.  నవంబర్ 1 న మొదలైన దీపావళి సంబురాలు ఈ నెల 10వరకు కొనసాగనున్నాయి. వేడుకల్లో భాగంగా బాలీవుడ్ కు చెందిన ప్రముఖులతో దుబాయ్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్శహిస్తున్నట్లు తెలుస్తుంది.
దీపావళి వేడుకల్లో భాగంగా ఎక్కువ మంది చేత ఒకేసారి ఎల్‌ఈడీ దీపాలను వెలిగించి గిన్నిస్ రికార్డ్ నమోదుచేయాలని దుబాయ్ ప్రభుత్వం బావిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటే దుబాయ్‌లో భారత జాతీయ పతాకాన్ని ప్రదర్శించడమే కాకుండా.. దుబాయి పోలీస్‌ బ్యాండ్‌ భారత జాతీయ గీతాన్ని గిటార్‌ మీద ప్లే చేశారు.  ఈ సందర్భంగా దుబాయ్‌ ఎయిర్‌లైన్‌ ఎమిరేట్స్‌ కూడా ప్రయాణికులకు భారతీయ సాంప్రదాయ మిఠాయిలను, చిరుతిళ్లను అందిస్తోంది.

No comments:

Post a Comment