Tuesday, 6 November 2018

ఇండియాలో ‘3D’ ఇళ్లు.. ఏడాదిలో తొలి ఇల్లు కడతామన్న సైంటిస్టులు

Gnews telugu channel:ఓ ఏడాదిలో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. మనదేశంలో 3D ఇళ్లను కట్టేం దుకు పనులు చకచకా జరి-గిపోతున్నాయి . IIT మద్రాస్‌‌కు చెందిన సైంటిస్టులు ఈ ఇంటి డిజైన్ ను సక్సెస్‌‌ఫుల్‌ గా ప్రింట్‌ చేశారు. సంస్థ పూర్వ విద్యార్థు లు మొదలు పెట్టిన స్టార్టప్‌ కంపెనీ‌ ‘త్వస్థ’కు చెందిన లాబోరేటరీలో ఈ పనులు జరుగుతున్నాయి. ఈ టెక్నాలజీని సామాన్య ప్రజలకు అందుబాటు లోకి తేవాలని రీసెర్చర్లు భావిస్తున్నారు. ‘కన్‌ స్ట్ర క్షన్‌ ఇండస్ట్రీ-లో 3డీప్రింటింగ్‌ ఓ రెవెల్యూషన్‌. ఇళ్లు, టాయిలెట్లు,రవాణా రంగ నిర్మాణాల్లో  వెనుకబడ్డ ఇండియాకు ఇది కొత్త ఊపిరినిస్తుంది. దీని కోసం  ప్రభుత్వ సంస్థలతో టై అప్‌‌ అవ్వా లని అనుకుంటున్నాం ’అని సైంటిస్టులు చెప్పా రు.
ఒక్క ఏడాదిలో తొలి 3డీ ప్రింటెడ్‌ హౌస్‌ను కడతామని త్వస్థ కో ఫౌండర్ వీఎస్‌‌ ఆదిత్య తెలిపారు. ప్రొటోటైప్‌‌  ప్రింట్‌ తయారీకి రెండ్రోజులు సమయం పట్టినట్లు చెప్పా రు.ప్రధానమంత్రి ఆవాస్‌‌ యోజన కింద ఇళ్లు, స్వచ్ఛభారత్‌ అభియాన్‌ కింద టాయిలెట్ల నిర్మాణంపై దృష్టి పెడతామన్నారు.  ప్రస్తుతం ఇంటి నిర్మాణం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కాంక్రీట్‌ ను వాడుతున్నట్లు తెలిపారు. సాధారణ సిమెంట్‌ కు బదులు జియో-పాలిమర్స్‌‌, మట్టి వాడకంపై రీసెర్చ్‌‌ జరుగుతుందన్నారు.

No comments:

Post a Comment