Saturday, 3 November 2018

స్టూడెంట్ పై స్కేలు విసిరిన టీచర్.. కేసు బుక్ చేసిన పోలీసులు

 సికింద్రాబాద్ : విద్యార్థులు తప్పుచేస్తే సరిదిద్దాల్సిన ఉపాధ్యాయులు పిల్లల్లా ప్రవర్తించడం హేయమైన చర్యగా చెప్పవచ్చు. సికింద్రాబాద్ రెజిమెంటల్‌బజార్‌లోని కీస్‌ హైస్కూల్‌లో ప్రియాంక (14) చదువుకుంటుంది. తన చేతిలో ఉన్న రీఫిల్ ను వంచడం తో అనుకోకుండా టీచర్ కు తగిలింది. క్షణికావేశానికి గురైన టీచర్ తన చేతిలో ఉన్న స్కేలును విద్యార్థిని పై విసిరింది. దీంతో ప్రియాంక కంటి పక్కన స్కేలు తగిలి రక్తం వచ్చింది. విషయం తెలుసుకున్న ప్రియాంక తల్లిదండ్రులు దవఖానకు తీసుకపోయారు. సదరు టీచర్ పై పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో కేసు ఫైల్ అయింది. స్కూలు యాజమాన్యం విద్యార్థిని తల్లిదండ్రులపై ఒత్తిడి చేయడం తో కేసు వాపసు తీసుకోవడానికి ముందుకొచ్చారు. పోలీసులు మాత్రం తాము కేసు నమోదు చేశామని ఇక కోర్టులో తేల్చుకోవాలని చెప్పారు.

No comments:

Post a Comment