Gnews telugu channel:ట్రాఫిక్ పోలీసులు బైక్ పేపర్లు, లైసెన్స్ అడిగారనే కోపంతో ఓ వ్యక్తి తన బైక్ ను తానే తగలబెట్టేశాడు. దీంతో అలర్టైన పోలీసులు ఫైర్ సిబ్బంది సాయంతో మంటలను ఆర్పేశారు. ఈ లోగా ఆ వ్యక్తి అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నాడు. ఈ ఘటన హర్యాణలోని గుర్ గావ్ లో జరిగింది.
ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పాలవ్యాపారం చేసుకునే ఓ వ్యక్తి తన రాయల్ ఎన్‌ఫీల్డ్ వచ్చాడు. అతని ఆపిన పోలీసులు బైక్ కు సంబంధించిన పేపర్లు చూపించాలని కోరారు. చూపించక పోవడంతో ఈ చలానా రాశారు. దీంతో తనకే చలానా రాస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ వ్యక్తి వెంటనే.. తన బైక్ ఫ్యూయల్ ట్యాంక్‌కు ఉన్న వైర్‌ను లాగి నిప్పు పెట్టేశాడు. భారీ ఎత్తున మంటలు రావడంతో పోలీసులు అలర్టయ్యారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ఆ మంటలు వల్ల ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనని.. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయిస్తున్న సమయంలో బైక్ కు నిప్పు పెట్టిన వ్యక్తి అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నాడు. అతడికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బైక్ నెంబరు ప్లేట్ స్థానంలో ఓం నమః శివాయ అని రాసి ఉందని చెబుతున్నారు పోలీసులు.

No comments:
Post a Comment