Saturday, 24 November 2018

కర్ణాటక బస్సు ప్రమాదం: 30కి పెరిగిన మృతులు.. ఐదుగురు చిన్నారులు మృతి

Gnews telugu channel:మాండ్యా : కర్ణాటక రాష్ట్రంలో శనివారం జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 30కి పెరిగింది. 35 మందితో వెళ్తున్న ప్రైవేటు బస్సు దక్షిణ కర్ణాటకలోని మాండ్యా జిల్లా కనగమూరడీ గ్రామంలోని ఓ కాలువలోకి దూసుకెళ్లింది. బస్సు డోర్ నేలవైపు ఉండిపోవడంతో… బస్సులోని ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. నీళ్లలో ఊపిరాడక బస్సులోనే ప్రాణాలు విడిచారు. పంట పొలాల్లో పనులు చేసుకుంటున్న వాళ్లు సహాయక చర్యలు చేశారు. ఓ చిన్నారి సహా.. ఐదుగురి ప్రాణాలను కాపాడారు
రాజధాని బెంగళూరు నగరానికి 105 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంపై ప్రధానమంత్రి మోడీ సంతాపం ప్రకటించారు. కర్ణాటక సీఎం కుమారస్వామి కంటతడి పెట్టారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ప్రకటించారు. డ్రైవర్ కు కంట్రోల్ తప్పడంతోనే బస్సు నీళ్లలో పడిందని డిప్యూటీ సీఎం పరమేశ్వర చెప్పారు. డ్రైవర్ నీళ్లలో ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చాడు.

No comments:

Post a Comment