Monday, 22 October 2018

మెట్రోలో మహిళలకు కేటాయించిన సీట్లలో కూర్చుంటే జరిమానా  

Gnews telugu channel:హైదరాబాద్‌ : మెట్రో రైళ్లలో మహిళల కోసం  కేటాయించిన సీట్లలో ఇతరులు కూర్చుంటే జరిమానా విధిస్తామని ప్రకటించారు హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి. మెట్రోరైల్‌ భవన్‌లో నిన్న(సోమవారం) ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు ఎన్వీఎస్‌ రెడ్డి. మహిళలు, సీనియర్‌ సిటిజన్లు, వికలాంగులకు ప్రత్యేకించిన సీట్లలో ఇతరులెవరైనా కూర్చుంటే రూ.500 జరిమానా వేస్తామన్నారు. ప్రతీ బోగీలో ఎల్‌అండ్‌టీ భద్రతా సిబ్బంది, పోలీసు నిఘాను అధికం చేస్తామని వివరించారు ఆయన. ఈ విషయంలో మహిళా ప్రయాణికులు తమకెదురయ్యే అసౌకర్యాన్ని తెలియజేసేందుకు  ఓ వాట్సాప్‌ నంబరును కేటాయించాలని అధికారులకు సూచించారు. ఈ నిర్ణయాలను త్వరలో అమలు చేస్తామని ఎల్‌అండ్‌టీ అధికారులు హామీ ఇచ్చారు. మెట్రోస్టేషన్ల పరిసరాలను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఎన్వీఎస్‌ రెడ్డి. ఇందుకోసం ముగ్గురు సభ్యులు గల టౌన్‌ప్లానింగ్‌, ఇంజినీరింగ్‌, పోలీసు అధికారులతో  ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఎల్‌బీనగర్‌ నుంచి మియాపూర్‌, నాగోల్‌ నుంచి అమీర్‌పేట వరకు  మెట్రో మార్గంలోని స్టేషన్లలో పనులను వేగంగా పూర్తిచేయాలని సూచించారు.

No comments:

Post a Comment