దీపావళి నాటికి రైతులందరి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేయాలని కృతనిశ్చయంతో ఉంది సర్కారు. గత ఖరీఫ్‌లో ప్రభుత్వం రైతులకు పెట్టుబడి చెక్కులను గ్రామసభల్లో అందజేసింది. దాదాపు 51 లక్షల మంది రైతులకు రూ. 5,200 కోట్ల వరకు ప్రభుత్వం అందజేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రబీలో చెక్కుల రూపంలో ఇవ్వకూడదని, హడావుడిగా పంపిణీ చేయకూడదని స్పష్టం చేసింది ఎలక్షన్ కమిషన్. దీంతో రైతుల ఖాతాల్లోనే రైతుబంధు సొమ్ము జమ చేయాలని తెలిపింది. దీంతో వ్యవసాయశాఖ రైతుల బ్యాంకు ఖాతా నంబర్లను సేకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ–కుబేర్ సాఫ్ట్‌వేర్ ద్వారా రైతులకు పెట్టుబడి సొమ్ము బ్యాంకులకు పంపిస్తున్నారు.
No comments:
Post a Comment