Gnews telugu channelదిల్లీ: కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు భారత్ బయోటెక్ తయారుచేసిన 'కోవాగ్జిన్'టీకాను ఆగస్టు15నాటికి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలసిందే. ఈ సమయంలో ఇంతతక్కువ వ్యవధిలో ఇదెలా సాధ్య మనే విషయంపై నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్ ) స్పష్టత నిచ్చింది. వ్యాక్సిన్ పై ప్రీ-క్లినిక ల్ ట్ర య ల్స్ విజయ వంతంగా పూర్తి చేసుకున్నందునే తదుపరి మొదటి- రెండోద శ క్లినిక ల్ ట్రయల్స్ కు అనుమతి ఇచ్చినట్లు ప్రకటించింది. దేశంలో అత్య వసర పరిస్థితిని పరిగణ నలోకి తీసుకొని వ్యాక్సిన్ ను వేగంగా తీసుకురావడంలో భాగంగా అంత ర్జాతీయ నిబంధన లకు అనుగుణంగానే ప్రయోగాలు చేపడుతున్నట్లు స్పష్టం చేసింది.
ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ అభివృద్ధిలో ఇప్పటికే పలుదేశాలు చేపట్టిన ప్రయోగాలు వివిధ దశలో ఉన్నాయని ఐసీఎంఆర్ పేర్కొంది.ఈ సమయంలోనే భద్రత , నాణ్యత, నైతిక విలువలను అనుసరించి దేశీయంగా వ్యాక్సిను రూపొందించుకోవడం ఎంతో ముఖ్యమని ఐసీఎంఆర్ అభిప్రాయపడింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన 'కోవాగ్జిన్' టీకాపై ఆ సంస్థ అందించిన సమగ్ర సమాచారం ఆశాజ నకంగా ఉండటం వల్లే తదుపరి ప్రయోగాలకు అనుమతి ఇచ్చినట్లు స్పష్టం చేసింది. ప్రజారోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఈ ప్రక్రియను వేగవంతం చేశామని, ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ రూపకల్పనలో నిమగ్న మైన పరిశోధన సంస్థలు ఇదే ప్రక్రియను అనుసరిస్తున్నట్లు ఐసీఎంఆర్ పేర్కొంది.
No comments:
Post a Comment