Gnews telugu channel:పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న భూక్యా లావణ్య (23) అనే వివాహితను భర్త విజయ్ గొంతునులిమి హత్య . పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరాకాలనీకి చెందిన లావణ్యను ఆరేండ్ల క్రితం గాంధీనగర్‌కు చెందిన విజయ్ ప్రేమించి వివాహం చేసుకున్నాడు. విజయ్ ఆటోనడుపతూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి నాలుగేండ్ల కుమార్తె ఉన్నది. కాగా రెండేండ్లుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మూడు నెలల క్రితం లావణ్య భర్తతో గొడవపడి తన తల్లి ఇంటికి వెళ్లి మసీద్గుట్టలో నివాసం ఉంటున్నారు. విజయ్ అక్కడికి కూడా వెళ్లి గొడవ చేస్తుండటంతో ఆమె తల్లితో కలిసి ఖమ్మం జిల్లా కల్లూరులోని స్వగ్రామానికి వెళ్లిపోయారు. విజయ్ తన కుమార్తె సోనీని తన వద్దే ఉంచుకున్నాడు. మూడ్రోజుల క్రితం లావణ్య తన బిడ్డను అప్పగించాలని పాల్వంచ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా విజయ్ భార్య లావణ్యకు ఫోన్ చేసి తన కుమార్తె సోనీని అప్పగిస్తానని . తన తల్లితో పాటు లావణ్య పాల్వంచ బస్టాండ్‌కు చేరుకున్నారు. అక్కడ వేచి ఉన్న విజయ్ తన అత్త జ్యోతిని అక్కడే ఉంచి లావణ్యను తనతో పాటు గాంధీనగర్‌కు తీసుకెళ్లాడు. ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన భర్త విజయ్ భార్య గొంతునులిమి హత్యచేశాడు. ఎంత సేపైనా లావణ్య రాకపోవడంతో అనుమానం వచ్చిన జ్యోతి అక్కడికి వెళ్లి చూడగా విగతజీవిగా ఉన్న లావణ్యను చూసి బోరున విలపించింది. విజయ్ పోలీసులకు లొంగిపోయాడు.
No comments:
Post a Comment