Gnews telugu channel:కరీంనగర్ నగర పాలక సంస్ధ ఆధ్వర్యంలో ఒక్క రూపాయికే రక్తమూత్ర పరీక్షలతో పాటు బీపీ,షుగర్ పరీక్షలు కూడా చేయనున్నట్లు నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ ప్రకటించారు. శనివారంలో నగరంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తను కరీంనగర్ మేయర్‌గా ఎన్నికైన నాటి నుండి ప్రజాలమోదంతో పథకాలను ప్రజలకు అందుబాటులో విశిష్ట సేవలు అందిస్తున్నానని అన్నారు. నగర పరిశుభ్రత, మంచి నీటి సరఫరా చేయడమే కాదు నగర ప్రజలకు వైద్యం అందించడం కూడా మున్సిపాలిటీ భాధ్యత అని, కరీంనగర్ ప్రజలకు చేరువయ్యే విధంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పథకాలు చేపట్టి విజయవంతం అయాయని అన్నారు. పేద ప్రజల కోసం నగరపాక సంస్థ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటుకు ఒక మెడికల్ ఆఫీసర్‌తో పాటు సిబ్బంది నియమకానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేంధర్ హామి ఇచ్చినట్లు తెలిపారు.
వైద్య అధికారి ఆధీనంలో నగరపాలక కార్యాలయంలో రూ.1 కే రక్తం, మూత్రం, బీపి, షుగర్ పరీక్షలు చేయిస్తామని తెలిపారు. ఈ పథకానికి ఇప్పటికే తీర్మాణం చేశాం త్వరలో పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. ప్రజల కోసం మరిన్ని విక్షణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

No comments:
Post a Comment