Friday, 28 June 2019

ఇక నుంచి పొద్దున,పగలు కూడా….డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలుంటాయ్ జాగ్రత్త…

Gnews telugu channel:కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు…
ప్రత్యక్షంగా పరిశీలించిన పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి

కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా పోలీసులు శుక్రవారం నాడు రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిర్వహించారు.
పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి ఈ తనిఖీలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రోడ్డు ప్రమాదాలు, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, ఓవర్ లోడ్ ల నియంత్రణకు ఈ తనిఖీలను నిర్వహిస్తున్నామన్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలతో రోడ్డు ప్రమాదాలు నియంత్రణలోకి వచ్చాయని చెప్పారు.  మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల సదరు వాహనదారులు తో పాటు పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు ఎక్కువ శాతం మంది మృత్యువాత పడుతున్నారని చెప్పారు.

కమిషనరేట్ వ్యాప్తంగా….

ఈ డ్రంక్ అండ్ తనిఖీలను ఉదయం,మధ్యాహ్నం వేళల్లో కూడా కొనసాగిస్తామని చెప్పారు. ఈ తనిఖీలకు అన్ని వర్గాల ప్రజలు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారని తెలిపారు.అన్ని వర్గాల ప్రజల సహకారంతో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేస్తామని చెప్పారు.

ఈ తనిఖీల్లో అడిషనల్ డిసిపి (లాఅండ్ ఆర్డర్)ఎస్ శ్రీనివాస్ లతోపాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment