Sunday, 14 April 2019

అక్కడ అన్నీ వింతలే: స్కూలుకెళ్లాలన్నా విమానమే

Gnews telugu channel: పసిఫిక్‌ మహాసముద్రంలో చిలీకి పశ్చిమం వైపున ఉంటుంది ఆ ద్వీపం. వైశాల్యం 48 చదరపు కిలోమీటర్లు. జనాభా 800. పెద్ద పెద్ద నౌకల విరిగిపోయిన భాగాలు ఎక్కడబడితే అక్కడ కనబడుతుంటాయి. ప్రజలు గుర్రాలు, గుర్రపు బండ్లపై తిరుగుతూ కనిపిస్తారు. అక్కడ వాచీలు ఎక్కు వగా వాడరు.ఎందుకంటే టైం చూసుకొని చేసేంత అర్జెంట్‌ పనులు చేసే వాళ్లు లేరు మరి. టెలివిజన్‌‌‌‌, కరెంటు వచ్చి ఎన్నో ఏళ్లయినా వేటాడి, లేదా దుంపలు తిని కాలం గడుపుతున్నారు. ద్వీపంలో చిన్న చిన్న వస్తువులు దొరికే షాపులు ఒకట్రెండు కనిపిస్తాయి. హైస్కూలు, హాస్పిటల్, సూపర్‌‌‌‌ మార్కెట్‌ కు వెళ్లాలంటే విమానం ఎక్కాల్సిందే. ఆ ద్వీపం పేరు ఇస్లా మోచా.

No comments:

Post a Comment