Gnews telugu channel: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఉదయం 9 గంటల 10 నిమిషాల సమయంలో లుక్లాలోని తెన్‌జింగ్ హిల్లరీ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అవుతుండగా సమ్మిట్ ఎయిర్‌కు చెందిన ఓ విమానం ప్రమాదవశాత్తూ… అక్కడి హెలిప్యాడ్‌లో నిలిపి ఉంచిన చాపర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విమానం లుక్లా నుంచి కాఠ్‌మండూకు ప్రయాణించాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే అలర్టైన ఎయిర్ పోర్టు అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రపంచంలో ఎత్తైన పర్వత శిఖరాల్లో ఒకటైన ఖొమొలుంగామాకు ఈ విమానాశ్రయం అతి సమీపంలో ఉంటుంది. దీంతో ఏప్రిల్, మే మాసాల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.
No comments:
Post a Comment