Thursday, 7 February 2019

మెట్రోరైలు స్టేషన్ల లిప్టులు ప్రేమికులకు అడ్డాగా మారాయి.


Gnews telugu channel హైదరాబాద్‌: రద్దీలేని మెట్రోరైలు స్టేషన్ల లిప్టులు ప్రేమికులకు అడ్డాగా మారాయి. ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్‌కు చేరుకునేందుకు ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ల్లో ప్రేమికులు కార్యకలాపాలు విస్మయం కల్గిస్తున్నాయి. యువజంటల ముద్దు దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి. బయటకొచ్చిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.  మెట్రోలోని ప్రతి ప్రదేశం సీసీ కెమెరాల నిఘాలో ఉంటుంది. ప్రయాణికుల కదలికలను ఉప్పల్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి  పర్యవేక్షిస్తుంటారు.కామ కలాపాలను గుర్తించిన మెట్రో అధికారులు ఇప్పటికే స్టేషన్లలో ఏకాంతంగా ఉండే ప్రదేశాల్లో హుందాగా ఉండాలనే సూచన బోర్డులు ఏర్పాటు చేశారు. వైరల్‌గా వీడియోలు మెట్రో అధికారుల దృష్టికి వెళ్లాయి. విచారణ చేస్తున్నట్లు మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.

No comments:

Post a Comment