Gnews telugu channel:దేశంలోనే తొలి… కులం, మతం లేని మహిళగా గుర్తింపు దక్కించుకున్నారు తమిళనాడుకు చెందిన స్నేహ. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ఆమెకు కులం, మతం లేదనే సర్టిఫికెట్ ఇచ్చింది. వేలూరు జిల్లా… తిరుపత్తూరుకి చెందిన ఆనందకృష్ణన్, మణిమొళి దంపతుల కూతురు స్నేహ. ఈమె చిన్నప్పటీ స్కూల్ సర్టిఫికెట్లలో ఎక్కడా కూడా కులం, మతాలు రాయలేదు. గతేడాది ఈమెకు పార్థివ్ రాజతో పెళ్లైంది. అప్పటికే ఆమె తాను ఏ కులానికీ, మతానికీ చెందిన దాన్ని కాదంటూ… సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకున్నారు. ఎట్టకేలకు దాన్ని పరిశీలించిన ప్రభుత్వం మంజూరు చేసింది. తిరుపత్తూరు తహశీల్దారు సత్యమూర్తి… స్నేహకు కులమతాలు లేని మహిళగా గుర్తిస్తూ సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో దేశంలోనే ఇలాంటి సర్టిఫికెట్ పొందిన తొలి మహిళగా స్నేహ గుర్తింపు పొందారు.
అసలు ఇలాంటి సర్టిఫికెట్ ఒకటి ఉంటుందని చాలా మందికి తెలియదు. 35 ఏళ్ల స్నేహ స్వతహాగా లాయర్. అందువల్ల ఈమెకు ఈ సర్టిఫికెట్ల విషయాలన్నీ బాగా తెలుసు. ఆమె తల్లిదండ్రులు కూడా లాయర్లే. అందువల్ల స్నేహను కులమతాలకు దూరంగా పెంచారు. రాజ్యాంగం ప్రకారం స్కూళ్లలో విద్యార్థుల కులమతాలను నమోదు చెయ్యకూడదు. కానీ చాలా స్కూళ్లలో నమోదు చేస్తున్నారు. కులం, మతం లేదనే సర్టిఫికెట్ స్నేహకు ఉన్నపళంగా రాలేదు. ఇందుకోసం ఆమె ఫ్యామిలీ 9 ఏళ్లపాటు పోరాడాల్సి వచ్చింది.

No comments:
Post a Comment