కేవలం రెండు వారాలే అక్కడ స్టే
చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్లు కాశికి ముందే వెళ్తారు. చివరిరోజుల్లో పెద్దవారికి వారి కుటుంబసభ్యులు తోడుంగా ఉంటారు. ఇలా వచ్చేవారి కోసమే అక్కడ ఓ హోటల్ ఉంది. దాని పేరు ముక్తి ధామం. డెత్ హోటల్ అని కూడా దీనికి పేరు. ఈ సముదాయంలో.. దాదాపుగా అన్నీ సింగిల్ రూమ్స్ ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్కరికి ఉండేందుకు రెండు వారాలు మాత్రమే అవకాశం. అప్పటికి కూడా బతికి ఉంటే… ఇంటికి వెళ్లి ఆరోగ్యం కాపాడుకోవాలని సూచిస్తారు. ఒకవేళ వాళ్లు వెళ్లడానికి ఇష్టంలేకపోతే… హోటల్ ముందు ఖాళీ స్థలంలోకి పంపించేస్తారు. ఎక్కువగా పేదవాళ్లు వస్తుంటారని నిర్వాహకులు చెప్పారు.
విమానాల్లో ఇక్కడకు వస్తారు
ముక్తికోసం విదేశాల నుంచి ఫ్లైట్ లలో వస్తుంటారు. మన దేశంలోనూ దూర ప్రాంతాలనుంచి కూడా వచ్చి ఈ హోటల్ లో స్టే చేస్తుంటారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సాధువులు వచ్చి పూజలు చేస్తారు. చావుకు దగ్గరైనవారికి గంగాజలం అందిస్తారు.
ప్రతిరోజూ హోటల్ ముందు పాడెలు
ఈ హోటల్ లో నెలకు 20 నుంచి 30 మంది చనిపోతుంటారు. అక్కడ ప్రతిరోజూ పాడెలు కట్టి గంగానది ఒడ్డుకు తీసుకెళ్తుంటారు. అక్కడ హిందూ సంప్రదాయం ప్రకారం వారికి కర్మకాండలు, అంత్యక్రియలు పూర్తిచేస్తారు.
No comments:
Post a Comment