Gnews telugu channel: సికింద్రాబాద్ లో దారుణం జరిగింది. తాగుడుకు బానిసైన భర్త .. తన భార్య గొంతు నులిమి చంపేశాడు. ఈస్ట్ మారేడ్ పల్లి వాల్మీకి నగర్ లో సన్నీ(30)… తన భార్య సత్యవతి(27)తో ఉండేవాడు. వీరిద్దరూ 2013లో ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. నగరంలో ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. భర్తకున్న తాగుడు అలవాటు… ఆ కాపురంలో చిచ్చు రగిలించింది. సోమవారం రాత్రి పదకొండు గంటల టైమ్ లో ఇంటికి తాగి వచ్చాడు సన్నీ. భార్యతో గొడవపడ్డాడు. ఆ ఘర్షణలోనే.. భార్యను మంచంపై పడేసి… గొంతు పిసికి చంపేశాడు. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి పారిపోయాడు.
వీరిద్దరూ తరచూ గొడవ పడుతుండేవారని ఇరుగుపొరుగు చెప్పారు. భార్యను చంపి పారిపోయిన సన్నీ… ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. ఒక్కసారిగా షాక్ అయిన సన్నీ తల్లిదండ్రులు…. జరిగిన దారుణాన్ని సత్యవతి తల్లిదండ్రులకు చెప్పారు. మంగళవారం మధ్య రాత్రి టైమ్ లో… మారేడ్ పల్లి పోలీసులతో కలిసి ఇంటికి వెళ్లారు మృతురాలి కుటుంబీకులు. తలుపులు పగలకొట్టి.. ఇంట్లోకి వెళ్లారు. పోలీసులు… డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్ కు పంపించారు. చనిపోయిన సత్యవతి నాలుగు నెలల గర్భిణి అని డాక్టర్లు చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడు… పోలీసులకు లొంగిపోయాడు. సత్యవతి తండ్రి రాములు కంప్లయింట్ చేయడంతో… అతడిపై మర్డర్ కేసు పెట్టారు పోలీసులు.

No comments:
Post a Comment