Thursday, 24 January 2019

అమృత, ప్రణయ్‌ లకు మగబిడ్డకు జన్మనిచ్చింది

Gnews telugu channel: ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గత ఏడాది ప్రణయ్ హత్య సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ప్రణయ్ సతీమణి అమృత అప్పటికే గర్భవతి. ఇప్పుడు ఆమెకు పండంటి కొడుకు పుట్టాడు. అమృత, ప్రణయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటికే అమృత ఐదు నెలల గర్బిణీ. ఇప్పుడు మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రిలో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది
. దాంతో ప్రణయ్ సంతోషం కనిపించింది. చనిపోయిన ప్రణయ్ పిల్లాడి రూపంలో జన్మించాడని వారు సంబరపడుతున్నారు. ప్రణయ్ హత్య అనంతరం అమృత మాట్లాడుతూ.. తాను తన బిడ్డ కోసం బతుకుతానని చెప్పింది. అమృత, ప్రణయ్‌లు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఈ కేసులో అమృత తండ్రి మారుతీ రావు, ఆమె బాబాయి, మరికొందరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై విచారణ సాగుతోంది. మరోవైపు, ప్రణయ్ హత్య తర్వాత అమృత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడిన సందర్భాలు ఉన్నాయి. దానిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రణయ్ హత్య అనంతరం అమృత అత్తింటి వారి వద్దే ఉంటోంది. తాను తల్లిదండ్రుల వద్దకు వెళ్లేది లేదని తేల్చి చెప్పింది. తన భర్త ప్రణయ్‌ను హత్య చేసిన తన తండ్రి మారుతీ రావును కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. తొలుత ఆమె పట్ల సానుభూతి కనిపించింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా విమర్శలు వచ్చాయి 

No comments:

Post a Comment