Gnews telugu channel: బీజింగ్: ప్రపంచంలోని అత్యద్భుత కట్టడాల్లో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కూడా ఒకటి. ఈ కట్టడానికి 2 వేల ఏళ్ల చరిత్ర ఉంది. అయితే త్వరలో ఇది కనిపించకుండా పోతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2 వేల ఏళ్ల కిందటి ఈ గోడ కొరియా సరిహద్దు నుంచి గోబి ఎడారి వరకు కొన్ని వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అలాంటి విశిష్టత కలిగిన గ్రేట్ వాల్ కొన్ని చోట్ల శిథిలావస్థకు చేరింది. ఇప్పటికే చాలా వరకు ప్రకృతిలో కలిసిపోయినట్లుగా నేషనల్ జాగ్రఫిక్ వెల్లడించింది. గోడలో 30 శాతం మేర కూలిపోయినట్లు తెలిపింది. మారుమూల ప్రాంతాల్లో ఈ పురాతన గోడ బాగోగులు పట్టించుకోకపోవడంతో అది ప్రమాదరకంగా మారింది. కనీసం మనుషులు దగ్గరకు వెళ్లే పరిస్థితి కూడా లేదు. దీంతో చైనా డ్రోన్లను రంగంలోకి దింపింది. ఈ ప్రపంచ ప్రఖ్యత కట్టడాన్ని సంరక్షించడానికి చర్యలు చేపట్టింది. ఈ అద్భుత కట్టడాన్ని చంద్రుడి మీది నుంచి కూడా కనిపించే మానవ నిర్మిత కట్టడంగా పిలుస్తారు.
No comments:
Post a Comment