Gnews telugu channel: లోకంలో అమ్మ ప్రేమను మించింది లేదు.. ఎలాంటి కల్మషం లేకుండా తన బిడ్డలను అల్లారు ముద్దుగా పెంచడంలో ఆమెకు సాటి ఎవరూ ఉండరు.. అయితే అమెరికా లోని ఓ తల్లి తన బిడ్డ ఏడుపు వినలేక.. ఆ పిల్లాడిని దారుణంగా చంపి అమ్మతనానికి మాయని మచ్చలా నిలిచింది. అరిజోనా(19) అనే యువతి నెల రోజుల క్రితం ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ చిన్నారి పుట్టుకతోనే అనారోగ్యంతో పుట్టాడు. దీంతో ఆ పసివాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉండేవాడు. అయితే ఆ తల్లి పిల్లాడి ఏడుపు ఆపడానికి ప్రయత్నించడం మానేసి బాత్‌టబ్‌లో ముంచి చంపేసింది.
తర్వాత పిల్లాడి మృతదేహాన్ని ఓ బ్యాగ్‌లో పెట్టి సమీపంలోని పార్క్‌లో వదిలేసి వచ్చింది. తర్వాత ఏం తెలియనట్లు తన బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తుండగా అరిజోనా మీద అనుమానం రావడంతో ఆమెను క్వశ్చన్ చేశారు. దీంతో తన కొడుకు నీళ్ల టబ్ లో జారి పడి చనిపోయాడని చెప్పింది . కానీ ఆమె సెల్‌ఫోన్ పరిశీలించిన పోలీసులు అరిజోనానే హంతకురాలిగా గుర్తించారు. బిడ్డను చంపడానికి ముందు అరిజోనా ఇంటర్నెట్లో ‘డౌట్ రాకుండా చంపడం ఎలా.. కేసు నుంచి తప్పించుకోవడం ఎలా ’ అనే అంశాల గురించి ఇంటర్నెట్ లో సర్చ్ చేసింది. దాంతో అరిజోనాను అరెస్ట్ చేసి విచారించగా అసలు విషయం బయటకొచ్చింది. కొడుకు ఏడుపు వినలేక తానే ఆ చిన్నారిని బాత్‌టబ్‌లో ముంచి చంపేసినట్లుగా అరిజోనా నేరం అంగీకరించింది.

No comments:
Post a Comment