Saturday, 4 July 2020

పబ్‌జీ ఆడి రూ.16 లక్షలు లాస్.. యువకుడ్ని మెకానిక్‌ పనిలో చేర్చిన తండ్రి

Gnews telugu channel న్యూఢిల్లి: పంజాబ్‌లో ఓ యువకుడు పబ్‌జీ గేమ్ వ్యామోహంలో పడి రూ.16 లక్షలు పోగొట్టుకున్నాడు. 17 ఏళ్ల వయస్సు గల ఖగర్‌‌పూర్‌‌కు చెందిన సదరు యువకుడు ఆన్‌లైన్ క్లాసుల కోసం స్మార్ట్‌ఫోన్ కావాలని పేరెంట్స్‌ను కోరాడు. వాళ్లు అంగీకరించి తమ ఫోన్స్‌ను అతడికి ఇచ్చారు. అయితే ఆన్‌లైన్ క్లాసులకు బదులు ఫోన్స్‌లో సదరు యువకుడు పబ్‌జీ గేమ్‌ ఆడేవాడు. ఆయా ఫోన్స్‌లో యువకుడి పేరెంట్స్‌కు చెందిన బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా సేవ్ అయి ఉన్నాయి. ఇది తెలుసుకున్న యువకుడు పబ్‌ జీ మొబైల్ ఐటమ్స్‌ కొనడానికి ఆన్‌లైన్ ట్రాన్‌సాక్షన్‌తో ఆయా డబ్బులను ఖర్చు చేశాడు. ఈ విషయాలు తన తల్లిదండ్రులకు తెలియకుండా ఉండాలని బ్యాంకుల నుంచి వచ్చే మెసేజెస్‌, ట్రాన్‌సాక్షన్ వివరాలను యువకుడు డిలీట్ చేసేవాడు. ఈ క్రమంలో పబ్‌ జీ మొబైల్ ఐటమ్స్ కొనడానికి సుమారు రూ.16 లక్షల వరకు ఖర్చు చేశాడు.
‘బ్యాంక్ నుంచి సమాచారం వచ్చిన తర్వాత మాకో విషయం అర్థమైంది. బ్యాంక్ బ్యాలెన్స్ నిల్ కావొద్దని ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్‌కు మా అబ్బాయి డబ్బులు పంపేవాడని గుర్తించాం. దీని కోసం వాడు తన తల్లి ఫోన్‌ను వాడేవాడు. ఈ  క్రమంలో నా హెల్త్  ట్రీట్‌మెంట్ కోసం దాచి ఉంచిన డబ్బులతో పాటు నా భార్య పీఎం మనీని కూడా వాడు ఖర్చు చేశాడు’ అని యువకుడి తండ్రి బోరుమన్నాడు. ఈ విషయం తెలిసిన తర్వాత సదరు యువకుడి తండ్రి అతణ్ని ఓ స్కూటర్ రిపేర్ షాప్‌లో పనికి చేర్చడం గమనార్హం.

‘నేను వాడ్ని ఇలాగే వదిలేయను. ఇంట్లో ఖాళీగా కూర్చోబెట్టి గేమ్స్‌ ఆడటానికి మొబైల్ ఫోన్ ఇవ్వబోను. ఆఖరికి చదువుకోవడానికి కూడా ఫోన్స్‌ను ఇవ్వను. స్కూటర్ మెకానిక్ షాప్‌లో మా అబ్బాయి పని చేస్తున్నాడు. ఇప్పుడు డబ్బు సంపాదించడం ఎంత కష్టమో వాడికి తెలుస్తుంది. నా కొడుకు భవిష్యత్ కోసమే ఆ డబ్బులను నేను జమ చేశాను’ అని యువకుడి తండ్రి తన బాధను వెళ్లగక్కాడు. కాగా, పిల్లల ఫిజికల్ అండ్  సైకలాజికల్ హెల్త్‌ను దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ రీసెంట్‌గా పబ్‌ జీని బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment