Gnews telugu channel:అద్భుతాలకు మారుపేరైన చైనా మరో అబ్బుర పరిచే మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ సోకిన దాదాపు ఆరేవేల రోగుల కోసం ఖాళీగా ఉన్న ఓ భవనాన్ని రెండు రోజుల్లో, అంటే 48 గంటల్లో వెయ్యి పడకలుగల అత్యవసర ఆస్పత్రిగా తీర్చిదిద్దింది. కరోనా వైరస్ మొట్టమొదట మానవుడికి సోకిన వుహాన్ పట్టణానికి సమీపంలో ఉన్న హాంగ్‌కాంగ్ నగరంలో దీన్ని తీర్చిదిద్దారు. అటు భవన నిర్మాణ సిబ్బంది తమ పనులు తాము చేసుకుపోతుండగానే ఇటు ఆస్పత్రి సిబ్బంది రెండు రోజులు అవిశ్రాంతంగా శ్రమించి పడకలను, వైద్య పరికరాలను, కంప్యూటర్ స్క్రీన్లను, ఆక్సిజన్ లైన్లను, అవసరమైన ఇతర వైద్య పరికరాలను 48 గంటల్లోగా అమర్చారు. ‘డెబ్బీ మౌంటేన్ రీజనల్ మెడికల్ సెంటర్’గా దీనికి నామకరణం చేసి కరోనా వైరస్ హాస్పిటల్‌కు అంకితం ఇచ్చారు. ఇందులోకి మంగళవారం రాత్రి పదిన్నర గంటలకు మొదటి బ్యాచ్ కరోనా వైరస్ రోగులను తరలించారు. ఇతర కరోనా వైరస్ రోగుల కోసం వుహాన్‌కు 75 కిలోమీటర్ల దూరంలో మరో భారీ కరోనా ఆస్పత్రి భవన నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మూడు రోజుల క్రితం పునాది తవ్వకాలను మొదలు పెట్టిన ఈ ఆస్పత్రి మరో వారం రోజుల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. మొత్తం పది రోజుల్లోనే ఆస్పత్రిని పూర్తి చేయాలని చైనా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
No comments:
Post a Comment