Gnews telugu channel: శబరిమలలో రెండు నెలల పాటు మండల పూజలు జరుగనుండటంతో అయ్యప్ప ఆలయాన్ని ఈరోజు సాయత్రం తెరువనున్నారు. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటినుంచి రెండుసార్లు ఆలయాన్ని తెరిచారు. గత రెండు సార్లు తీవ్రమైన ఆందోళనలు జరుగడంతో ఈ సారి భారీగా భద్రతను పెంచారు. సుమారు 15 వేల మంది పోలీసు సిబ్బందితో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. శబరిమల ఆలయ పరిసరాల్లో గురువారం అర్ధరాత్రి నుంచే 144 సెక్షన్‌ను పోలీసులు విధించారు.
ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలన్న అంశంపై నిన్న అఖిలపక్ష సమావేశాన్ని ముఖ్యమంత్రి పినరై విజయన్ ఏర్పాటు చేయగా.. పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ.. తీర్పునకు వ్యతిరేకంగా వ్యవహరించబోమని విజయన్ స్పష్టం చేశారు.

No comments:
Post a Comment