Gnews telugu channel: హైదరాబాద్ లో కుండపోతగా వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు మామూలుగా ఉన్న వాతావరణం ఒక్కసారి మారిపోయింది. తర్వాత నగరంలోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టిగా వర్షం కురుస్తోంది. కోఠి, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, హిమయత్‌నగర్, హైదర్‌గూడ, లక్డీకాపూల్, సుల్తాన్‌బజార్, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, సనత్‌నగర్, బాలానగర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, లింగంపల్లి, కూకట్‌పల్లి, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం కురిసిన వర్షానికే రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురవడంతో పనుల నిమిత్తం బయటకు వచ్చిన వారు తడిసి ముద్దయ్యారు. మరోవైపు ఇవాళ బతుకమ్మ పండుగ కావడం…బతుకమ్మ ఆడేందుకు ఏర్పాటు చేసిన ప్రాంతాలన్ని జలమయమయ్యాయి.
No comments:
Post a Comment