GNEWS TELUGU Channel:లూయిస్ బ్రెయిలీ 212.వ జయంతి వేడుకలు పురస్కరించుకొని సోమవారం మల్కపేటలోని
ఆర్థిక సహకార సంస్థ కార్యాలయంలో లూయిస్ బ్రెయిలీ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన *తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు*. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి వర్చువల్ కాన్ఫరెన్స్ ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి గారు మాట్లాడుతూ కళ్లు లేని వారి కన్నీళ్లు తుడిచావు
అంధకారం తొలగించి అక్షర జ్ఞానం అందించాడు.
👉రాతతో అంధుల తలరాత మార్చిన ఓ విధాతా అని కొనియాడారు.
👉సంస్థ ప్రాంగణంలోని హైస్కూల్ ను వేరే ఏదో సంస్థకు అప్పగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని, ఇది మీ కోసమే ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పుడున్న మాదిరిగానే కొనసాగుతుందని మూగ, చెవిటి విద్యార్థులకు మంత్రి హామీనిచ్చారు.
👉మంత్రి ఇచ్చిన హామీ పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ చప్పట్లు కొట్టారు.
బ్రెయిలీ జయంతి వేడుకలలో దివ్యాంగులు, వయోవృద్ధులు,మాతా శిశు సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి దివ్యా దేవరాజన్, దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ ఛైర్మన్ వాసుదేవరెడ్డి, కమిషనర్ శైలజ, జనరల్ మేనేజర్ ప్రభంజన్ రావులతో పాటు అంధులు, దివ్యాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment