Friday, 13 December 2024

ఐపీసీ సెక్షన్ 498 ఏని దుర్వినియోగంచేస్తున్నారని అసహనo

వేధింపుల నుంచి రక్షణ కోసం చేసిన చట్టాన్ని కక్ష సాధింపు కోసం ఉపయోగిస్తున్నారు: సుప్రీంకోర్టు
  
భర్త, భర్త కుటుంబంపై కక్ష సాధించేందుకు తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపాటు 


ఓ కేసు విషయంలో తెలంగాణ హైకోర్టు తీరును తప్పుబట్టిన సుప్రీం

అత్తవారింట్లో భర్త, భర్త కుటుంబ సభ్యుల వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించడం కోసం ఉద్దేశించిన చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారంటూ సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. భర్తపై, భర్త కుటుంబంపై వ్యక్తిగత కక్ష సాధించడం కోసం 498 ఏ సెక్షన్ కింద తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడింది. పోలీసులు, యంత్రాంగం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, వ్యక్తిగత కక్ష సాధింపులకు అవకాశం ఇవ్వకూడదని పేర్కొంది. ఈమేరకు తెలంగాణకు సంబంధించిన ఓ కేసు విచారణలో భారత అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

వివాహాన్ని రద్దు చేయాలంటూ తాను కోర్టుకెక్కితే భార్య తనపై వేధింపుల కేసు పెట్టిందని, తప్పుడు ఉద్దేశంతో కక్ష సాధింపు కోసం పెట్టిన ఈ కేసును కొట్టేయాలని తెలంగాణ వ్యక్తి సుప్రీంను ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు తన పిటిషన్ ను కొట్టేయడంతో సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ల ధర్మాసనం.. తెలంగాణ హైకోర్టు తీరును తప్పుబట్టింది. వ్యక్తిగత కక్ష సాధింపు కోసమే పెట్టిందని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ కేసు కొట్టేయడానికి నిరాకరించడం తప్పిదమని వ్యాఖ్యానించింది.

ఐపీసీ సెక్షన్ 498 ఏ లేదా భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని సెక్షన్ 86ను భర్త తరపువాళ్లపై కక్ష సాధించేందుకు భార్య ఓ ఆయుధంగా మార్చుకుంటోందని విమర్శించింది. దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులు పెరుగుతుండడంపై సుప్రీం బెంచ్ ఆందోళన వ్యక్తం చేసింది. నిరాధార ఆరోపణలతో అమాయకులను కేసుల్లో ఇరికిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పష్టమైన ఆధారాలు లేకుండా చేసే ఇలాంటి ఫిర్యాదుల ఆధారంగా భర్తను, భర్త కుటుంబ సభ్యులను ప్రాసిక్యూట్ చేయడం తగదని, ఈ తరహా ఫిర్యాదుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసు యంత్రాంగానికి సుప్రీంకోర్టు సూచించింది.

ఏమిటీ ఐపీసీ సెక్షన్ 498 ఏ..

భర్త, భర్త కుటుంబ సభ్యులు వేధింపులకు పాల్పడిన సందర్భాలలో భార్యకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించినదే ఐపీసీ సెక్షన్ 498 ఏ లేదా భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని సెక్షన్ 86.. ఈ సెక్షన్ ప్రకారం.. వరకట్నం కోసం, అదనపు కట్నం కోసం లేదా మరేదైనా కారణంతోనో భార్యలపై భర్త, భర్త కుటుంబ సభ్యులు శారీరక, మానసిక వేధింపులకు పాల్పడితే ఐపీసీ 498 ఏ, బీఎన్ఎస్ 86 ప్రకారం కేసు నమోదు చేయవచ్చు. ఈ కేసుల్లో దోషిగా తేలితే భర్త, భర్త కుటుంబ సభ్యులకు మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఈ సెక్షన్ కింద నమోదు చేసిన కేసుల్లో బెయిల్ పొందే వీలులేదు. ఇది నాన్ బెయిలబుల్ కేసు.

డిజిటల్ మీడియా జర్నలిస్ట్ లను గుర్తించాలని కరీంనగర్ జిల్లా డిపిఆర్వో కు డిఎంజేయు వినతి పత్రం…

కరీంనగర్ జిల్లా: డిసెంబర్ 13 GNEWS TELUGU  CHANNEL 

ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిజంను ఫోర్త్ ఎస్టేటగా పిలుస్తారని ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాకు ధీటుగా డిజిటల్ మీడియా వచ్చేసిందని గతంలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులము అయినా మేము డిజిటల్ మీడియాలోకి వచ్చి ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా పనిచేస్తున్నామని డిజిటల్ మీడియా జర్నలిస్టులకు సామాజిక భద్రత కొరవడిందని, అంతే కాకుండా ప్రభుత్వం నుండి ఆదరణ కూడా కరువైందని, ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా డిజిటల్ మీడియా జర్నలిస్టులు వార్తలను సేకరించి ఎప్పటికప్పుడు క్షణాలలో డిజిటల్ మీడియా ద్వారా ప్రజలకు సమాచారాన్ని  చెరవేస్తున్నారని డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు చాలా మంది తెలంగాణ ఉద్యమ వార్తలను కవరేజ్ చేసిన వాళ్ళే, హక్కుల సాధనకోసం డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ (DMJU) పనిచేస్తుందని ఐక్యత, ఆచరణ నినాదంతో పనిచేస్తున్నామని, కావున డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలని,డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న వారిని జర్నలిస్టులుగా గుర్తించాలని, డిజిటల్ మీడియా జర్నలిస్టు పిల్లలకు అక్రిడేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రైవేటు విద్యా సంస్థలలో 50% ఫీజు రాయితీ కల్పించాలని, అలాగే అక్రిడేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఇండ్ల స్థలాలు కేటాయించాలని,  సామాజిక భద్రత కోసం మీడియా కమిషన్ ను ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్ ల సాధనకోసం DMJU కృషి చేస్తుందని, డిజిటల్ మీడియా జర్నలిస్టు ల సమస్యలని వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా (DMJU) అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొమ్ము గణేష్ జిల్లా కలెక్టర్ కు మరియు DPRO లకు వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలోDMJU ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కొమ్ము గణేష్ తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యులు సంతోష్,  దాసరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


Saturday, 23 April 2022

పెట్రో మరియు ఎలక్ట్రిక్ స్కూటీ నీ రూపొందించిన యువ ఇంజనీర్

 Gnews Telugu channel : మనం పెట్రోల్ ఎలక్ట్రిక్ తో నడిచే లేదా స్కూటీ లను చూశాం కానీ
రెండు ఎనర్జీతో నడిచే స్కూటీ ని రూపొందించాడు కరీంనగర్ జిల్లా సాయినగర్ లో నివాసం ఉంటున్న బీటెక్ చదివిన బుధవారం గంగాధర్, ఇతను తయారు చేసిన విధానం అలాగే దీని వలన ఉపయోగాలు , ప్రజలకు మరియు ప్రభుత్వానికి తెలుపుతున్నాయి నడిపి గమ్య స్థానం చేరుకోవచ్చునని ఈ రెండు రకాల ఎనర్జీలు వాడటం వల్ల ఎక్కువ దూరాన్ని తకువా కర్చుతో చేరుకోవచ్చునన్నారు దీన్ని తయారు చేయడానికి సుమారు 35000 రూపాయలు కర్చు ఔతుంది అని.పెట్రోల్ ఇంజన్ వాహనాన్ని
ఎలెక్ట్రిక్ వాహనంగా మార్చడం వలన పెట్రోల్ ఇంజిన్ కి  ఎలాంటి  ప్రాబ్లెమ్ లేదని అన్నారు.ప్రభుత్వ అధికారులు స్పందించి నాకు పేటెంట్ హక్కులు కల్పించినట్లయితే మరిన్ని వాహనాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా తయారు చేస్తానని తెలిపారు. యువ ఇంజనీర్ కనిపెట్టిన పెట్రో కం ఎలక్ట్రిక్ బైక్ ప్రయోగం విజయవంతం అయి ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని కోరుకుందాము

Monday, 29 March 2021

💥కరోనా వచ్చిందని ఊల్లోకి రానివ్వట్లేదు

Gnews telugue channel: అదిలాబాద్ జిల్లా//ఇంద్రవెల్లి:* కరోనా కారణంగా ఓ విద్యార్థిని ని ఊళ్ళోకి రానివ్వకపొవడం తొ భయం గుప్పిట్లో గడుపుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం. సాలేగూడకు చెందిన సోన్ దేవి గురుకుల కాలేజీలో ఇంటర్ చదువుతూ కరోనా బారిన పడింది. ఆమెను ఊల్లొకి రాకుండా గ్రామస్థులు అడ్డుపడ్డారు. క్వారంటైన్ పూర్తయితేనే అనుమతిస్తామని చెప్పడంతో సోన్ దేవి ఊరి చివర్లో ఉన్న తమ పాలంలోనే ఐసోలేషన్లో ఉంటోంది. *మరో 4 రోజులు పూర్తయ్యాకే ఊళ్లో అడుగుపెట్టనిస్తామని తేల్చి చెప్పారు...

Wednesday, 3 March 2021

శివరాత్రి మహోత్సవాలు జాతర (2021) పోస్టర్ ఆవిష్కరించిన *సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్

  కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామం లో శ్రీ సాంబమూర్తి దేవాలయ శివరాత్రి మహోత్సవాలు జాతర (2021) పోస్టర్ ఆవిష్కరించిన *సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ గారు,* 
ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి గారు, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు పాకాల రాజయ్య,  సర్పంచ్ మోర సుధాకర్ ఎంపీటీసీ బెల్లల రోజారాణి లక్ష్మన్,
 దేవాలయ చైర్మన్ చింతల తిరుపతి, వైస్ చైర్మన్ భైరి సురేష్ ప్రధాన కార్యదర్శి మెరుగు సాగర్ కోశాధికారి జమ్మికుంట దామోదర్ కమిటీ సభ్యులు నాగమల్ల భూపతి తెరాస నాయకలు సూర వెంకటేశం పాల్గొన్నారు.

Tuesday, 5 January 2021

ప్రియతమ నేత జనహృదయ నాయకుడు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ శ్రీ తాటిపర్తి జీవన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు

GNEWS TELUGU channel: కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం మధుర నగర్ ఎక్స్ రోడ్ నందు ప్రియతమ నేత జనహృదయ నాయకుడు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ శ్రీ తాటిపర్తి జీవన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది.అనంతరం వారి నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది.ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుడు పురమల్ల మనోహర్,  మండల ప్రధాన కార్యదర్శి దుబాసి బుచ్చన్న, జిల్లా అధికార ప్రతినిధి చిప్ప చక్రపాణి,బీసీ సెల్ అధ్యక్షుడు రేండ్ల రాజిరెడ్డి,సీనియర్ నాయకులు బట్టు లక్ష్మీనారాయణ ఉపాధ్యక్షులు దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు బురుగు గంగన్న, కార్యదర్శులు తోట కరుణాకర్ శ్రీనివాస్ రెడ్డి ఏం రెడ్డి నరేందర్ రెడ్డి, శంకర్, యూత్ కాంగ్రెస్ మహేందర్ బాబు, దూలం లచ్చన్న ముచ్చె శంకర్, శ్రీధర్, మరియు తదితరులు పాల్గొన్నారు

Monday, 4 January 2021

లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకల్లోపాల్గొన్న మంత్రి కొప్పుల

GNEWS TELUGU Channel:లూయిస్ బ్రెయిలీ 212.వ జయంతి వేడుకలు పురస్కరించుకొని సోమవారం మల్కపేటలోని
ఆర్థిక సహకార సంస్థ కార్యాలయంలో లూయిస్ బ్రెయిలీ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన *తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు*. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి వర్చువల్ కాన్ఫరెన్స్ ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి గారు మాట్లాడుతూ కళ్లు లేని వారి కన్నీళ్లు తుడిచావు
అంధకారం తొలగించి అక్షర జ్ఞానం అందించాడు. 
👉రాతతో అంధుల తలరాత మార్చిన ఓ విధాతా అని  కొనియాడారు.
👉సంస్థ ప్రాంగణంలోని హైస్కూల్ ను వేరే ఏదో సంస్థకు అప్పగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని, ఇది మీ కోసమే ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పుడున్న మాదిరిగానే కొనసాగుతుందని మూగ, చెవిటి విద్యార్థులకు మంత్రి హామీనిచ్చారు.
👉మంత్రి ఇచ్చిన హామీ పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ చప్పట్లు కొట్టారు. 
బ్రెయిలీ జయంతి వేడుకలలో దివ్యాంగులు, వయోవృద్ధులు,మాతా శిశు సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి దివ్యా దేవరాజన్, దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ ఛైర్మన్ వాసుదేవరెడ్డి, కమిషనర్ శైలజ, జనరల్ మేనేజర్ ప్రభంజన్ రావులతో పాటు అంధులు, దివ్యాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.